Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్లిప్ కార్ట్ లో 'ఆనర్ 9' లైట్ ఫ్లాష్ సేల్ ఈ రోజే!

  • మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం
  • రెండు వెర్షన్లలో లభ్యం
  • వీటి ధరలు రూ.10,999, రూ.14,999
హ్యూవేకి చెందిన 'ఆనర్ 9' లైట్ స్మార్ట్ ఫోన్ ను ఫ్లాష్ సేల్ రూపంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో విక్రయించనున్నారు. మొదటి రెండు మూడు నిమిషాల్లోనే అమ్ముడుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మోడల్ ను ఆనర్ గత నెలలోనే విడుదల చేసింది. 2018లో కంపెనీకి ఇది తొలి మోడల్. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.10,999. 4జీబీ ర్యామ్ 64జీబీ వెర్షన్ ధర రూ.14,999.

యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనుగోలుకూ అవకాశం ఉంది. గ్లేసియర్ గ్రే కలర్, మిడ్ నైట్ బ్లాక్, శాఫైర్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. మిర్రర్ ఫినిష్ తో ఉండే దీని వెనుక ప్యానెల్ కు 12 లేయర్ల గ్లాస్ ను వాడినట్టు కంపెనీ ప్రకటించింది. 2.5డీ గ్లాస్ కోటింగ్ రెండు వైపులా ఉండడం అదనపు ప్రత్యేక అంశం. ఇందులో మరో ఆకర్షణీయత ఏమిటంటే, నాలుగు కెమెరాలు. ముందు రెండు, వెనుక రెండు 13+2 మెగాపిక్సల్స్ కాంబినేషన్ తో ఉంటాయి.
honor
flipkart

More Telugu News